హాలీవుడ్ తెరపై... మళ్లీ రెండో ప్రపంచయుద్ధం | Christopher Nolan's next project is a WWII movie | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ తెరపై... మళ్లీ రెండో ప్రపంచయుద్ధం

Jan 6 2016 12:23 AM | Updated on Sep 3 2017 3:08 PM

హాలీవుడ్ తెరపై... మళ్లీ రెండో ప్రపంచయుద్ధం

హాలీవుడ్ తెరపై... మళ్లీ రెండో ప్రపంచయుద్ధం

హాలీవుడ్ దర్శకుల్లో సమ్‌థింగ్ డిఫరెంట్‌గా అనిపిస్తాడు క్రిస్టఫర్ నోలన్. ‘ది మెమెంటో’, ‘డార్క్ నైట్ రెజైస్’, ‘ఇన్‌సెప్షెన్’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

హాలీవుడ్ దర్శకుల్లో సమ్‌థింగ్ డిఫరెంట్‌గా అనిపిస్తాడు క్రిస్టఫర్ నోలన్. ‘ది మెమెంటో’, ‘డార్క్ నైట్ రెజైస్’, ‘ఇన్‌సెప్షెన్’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఏడాది ‘ఇంటర్‌స్టెల్లార్’ చిత్రంతో ప్రేక్షకులను అంతరిక్ష వీధుల్లోకి తీసుకెళ్లి ఓ అద్భుత అనుభవాన్ని అందించిన నోలన్, ఈ సారి ఓ పీరియాడికల్ మూవీని తెరకెక్కించనున్నారు.
 
  రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో 1940వ సంవత్సరంలో ఫ్రాన్స్‌లో జరిగిన ఓ చారిత్రక ఘటన ఆధారంగా ‘డంకిర్క్’ అనే చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ చిత్రానికి  నిర్మాత కూడా ఆయనే. ఇప్పటికే ఈ చిత్రానికి  స్క్రీన్‌ప్లే కూడా పూర్తిచేశారు నోలన్. ‘ఇంటర్‌స్టెల్లార్’ తరహాలోనే ఈ చిత్రాన్ని  ఐమాక్స్ ఫార్మాట్‌లో చిత్రీకరించనున్నారు. ఈ ఏడాది మే నెలలో చిత్రీకరణ ప్రారంభించి, వచ్చే ఏడాది జూలై 21న విడుదల చేయనున్నారు.
 

Advertisement
Advertisement