బిగ్‌బాస్‌: ఆ నలుగురిలో గెలిచేదెవరు? | Bigg Boss 3 Telugu Who Wins The Battle Of Battalion Task | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: మెడల్‌పైనే నలుగురి గురి!

Oct 3 2019 1:24 PM | Updated on Oct 3 2019 1:31 PM

Bigg Boss 3 Telugu Who Wins The Battle Of Battalion Task - Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో పదకొండో వారం కొనసాగుతోంది. ఒకరోజు సరదా టాస్క్‌, మరోరోజు ఫిజికల్‌ టాస్క్‌లు, వీకెండ్‌లో నాగార్జున వేసే మొట్టికాయలు, ఇంటిసభ్యులు చేసే అల్లరితో గడిచేది. కానీ ఈవారం అందుకు భిన్నంగా కాస్త సీరియస్‌గా సాగుతున్నట్టు అనిపిస్తోంది. నామినేషన్‌ ప్రాసెస్‌ కన్నా బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు ఇచ్చిన ‘బ్యాటిల్‌ ఆఫ్‌ ద బెటాలియన్‌ టాస్క్‌’ మరింత గంభీరంగా నడుస్తోంది. ఇక ఈ టాస్క్‌లో ఇంటిసభ్యులు నువ్వానేనా అన్న రీతిలో ‘పానీ’పట్‌ యుద్ధాలు చేశారు. ఉన్న రెండు కుళాయిల్లో ఒకదాన్ని పగలగొట్టారు కూడా! మరోవైపేమో అనర్హులైన రాహుల్‌.. బాబా భాస్కర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా మహేశ్‌.. శివజ్యోతికి మద్దతిచ్చాడు. ఇక వరుణ్‌ కూడా మొదట బాబా కంటెయినర్‌లో నీళ్లు నింపకుండా నిలువరించడానికి ప్రయత్నించగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వరుణ్‌.. బాబాను వదిలేసి అలీరెజాను అడ్డుకోటానికి యత్నించాడు.

అయితే అది పైపై ప్రయత్నంలానే కనిపించింది. ఇక అలీరెజా శివజ్యోతి కంటెయినర్‌లో నీళ్లు పోయడంతో బిగ్‌బాస్‌ ఇరువురిని టాస్క్‌లో అనర్హులుగా ప్రకటించాడు. కాగా మొదటి లెవల్‌లో విజయం సాధించిన వితిక నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించటంతో శ్రీముఖి, అలీ రెజా, శివజ్యోతి, బాబా భాస్కర్‌లు రెండవ లెవల్‌ తలపడనున్నారు. ఈ టాస్క్‌లో వారి శరీరాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది. టాస్క్‌ ఆడేవారు ప్రత్యేక ఫ్రేములలో నిలబడగా వారి తలపై ఒక వస్తువును పెడతారు. అది కిందపడకుండా వారు జాగ్రత్తపడాల్సి ఉంటుంది. ఇక ఆ వస్తువును చేతితో తాకటానికి వీలు లేదని తెలుస్తోంది. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలుస్తారు, ఎవరు మెడల్‌ గెలుచుకుంటారో చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement