బిగ్‌బాస్‌ను ఇన్వైట్‌ చేసిన బామ్మ

Bigg Boss 3 Telugu: Varuns Grand Mother Crazy Invites To Bigg Boss - Sakshi

బిగ్‌బాస్‌ పదమూడోవారం ఎమోషనల్‌ జర్నీగా మారుతోంది. ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు హౌస్‌మేట్స్‌ మిగిలారు. వీరు టీవీ, ఫోన్‌లను వదిలేసి, బయట ప్రపంచానికి దూరంగా ఉంటూ 85 రోజులు కావస్తోంది. ఉన్నదల్లా హౌస్‌లో ఉన్నవారితోనే ఆటలు, పాటలు, అల్లరి పనులు, గొడవలు, వగైరా! ఏ ఎమోషన్‌ అయినా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నవారితోనే పంచుకోవాలి, వారితోనే తెంచుకోవాలి. ఇక బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ స్వాంతన కలిగించారు. వారి కుటుంబ సభ్యులను ఇంట్లోకి పంపించారు. దీంతో కొద్ది నిమిషాలైనా ఫ్యామిలీ మెంబర్స్‌తో గడిపే అవకాశం దక్కిందని హౌజ్‌మేట్స్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అదే సమయంలో వారు వచ్చి వెళ్లిపోతుంటే కన్నీటిపర్యంతం అవుతున్నారు. 

ఇప్పటికే వితిక, అలీ రెజా, శివజ్యోతి, బాబా భాస్కర్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ ఇంట్లోకి వచ్చి పలకరించి వెళ్లిపోయారు. మా వాళ్లెప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్న రాహుల్‌, శ్రీముఖి, వరుణ్‌ల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. తాజా ప్రోమో ప్రకారం కన్ఫెషన్‌ రూమ్‌లో నుంచి రాహుల్‌ తల్లి అతన్ని పిలుస్తోంది. గతంలో అమ్మ గుర్తుకు వచ్చిందని ఏడ్చిన రాహుల్‌.. ఇప్పుడు అమ్మ కళ్లెదుటే ఉండటంతో సంతోషిస్తాడో, కన్నీటిపర్యంతం అవుతాడో చూడాలి. అలాగే వరుణ్‌ బామ్మ కూడా ఇంట్లోకి అడుగుపెట్టి సందడి చేసినట్టు కనిపిస్తోంది. అందరూ బామ్మ చుట్టూ చేరగా.. ఆమె బోలెడు కబుర్లను ఇంటి సభ్యులతో పంచుకున్నట్లు తెలుస్తోంది. ‘బిగ్‌బాస్‌.. మా ఇంటికి రావాలి’ అని ఇన్వైట్‌ చేయడంతో ఇంటి సభ్యులంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఈ సరదా కబుర్లు చూడాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top