ఆర్య సావాసమే వద్దు | Arya do not exer : nayanatara | Sakshi
Sakshi News home page

ఆర్య సావాసమే వద్దు

Mar 12 2014 12:14 AM | Updated on Sep 2 2017 4:35 AM

ఆర్య సావాసమే వద్దు

ఆర్య సావాసమే వద్దు

సావాసమే వద్దంటుంటే చాలా సాన్నిహిత్యం ఉందంటూ ప్రచారం చేస్తున్నారంటూ నటి నయనతార నటుడు ఆర్యపై ఫైర్ అయ్యారు. ఇక్కడ ఎవరు? ఎప్పుడు? ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో?

సావాసమే వద్దంటుంటే చాలా సాన్నిహిత్యం ఉందంటూ ప్రచారం చేస్తున్నారంటూ నటి నయనతార నటుడు ఆర్యపై ఫైర్ అయ్యారు. ఇక్కడ ఎవరు? ఎప్పుడు? ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో? ఎవరి మధ్య ఎలాంటి స్టాండ్ ఉంటుందో చెప్పడం కష్టం. ప్రేమికులా అంటే కాదు మేము మంచి స్నేహితులం అంటారు. సన్నిహితులా అంటే అలాంటిదేమి లేదు. జస్ట్ సహ నటీనటుల్లాటే మసలుకుంటున్నాం అంటారు. మొన్నటి వరకు ప్రేమికులుగా ఉన్నవారు ఈ రోజు  ఏమీ లేదు అంటూ దులుపేసుకుంటారు. అందుకేనేమో చిత్ర పరిశ్రమను విచిత్ర పరిశ్రమ అంటారు. ఇక నటి నయనతార విషయానికొస్తే శింబుతో డీప్ లవ్‌లో పడ్డారు. అవును తాము ప్రేమించుకుంటున్నాం అన్నారు.
 
 అయితే కొన్ని రోజులకే అది బ్రేక్ అప్ అయ్యింది. ఆ తరువాత నయనతార, ప్రభుదేవాల ప్రేమ మైకం పెళ్లి వరకు వెళ్లడం అది పెటాకులవ్వడం తెలిసిందే. ఈ రెండు సంఘటనల మధ్య నయనతార, ఆర్యతో కలసి బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రంలో నటించారు. అప్పుడు వీరిద్దరూ మనసులు పారేసుకున్నారనే ప్రచారం జరిగింది. అప్పట్లో అదేమి లేదు మా మధ్య ఉన్నది జస్ట్ ఫ్రెండ్‌షిప్‌నే అంటూ ఇద్దరూ ఒక ప్రకటన పారేశారు. అయితే మా మధ్య మంచి కెమిస్ట్రీ, ఫిజిక్స్ వర్కౌట్ అయ్యాయంటూ మంచి కిక్ ఇచ్చే స్టేట్‌మెంట్స్ గుప్పించారు. ఇటు శింబుతో అంటూ ప్రభుదేవాతో ప్రేమ గూడు చెదిరిపోవడంతో, కొంతకాలం సినిమాలకు దూరంగా వున్న నయనతార మళ్లీ రీ ఎంట్రీ అయ్యి వరుస విజయాలతో దూసుకుపోతోంది. 
 
 రీ ఎంట్రీలో మరోసారి ఆర్యతో రాజారాణి చిత్రంలో నటించి మాది హిట్ జంట అని మరోసారి నిరూపించారు. దీంతో ఆర్య మళ్లీ ఆమె సాంగత్యాన్ని పొందాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. నయనతార తన అదృష్టదేవత అంటూ పత్రికలకు ప్రకటనలిస్తుండడంతో ఆయన భావనేమిటో అర్థం అవుతోంది. అయితే ఈ వ్యాఖ్యలు నయనతారకు సుతారం నచ్చలేదు. దీంతో ఆర్యపై ఆమె మండిపడుతున్నారు. అసలు సావాసమే వద్దనుకుని పక్కకు తప్పుకుపోతుంటే అదృష్టదేవత అం టూ తన మధ్య ఏదో సంబంధం ఉన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆర్యపై ఫైర్ అయ్యారు. ఇలాంటి ప్రవర్తనతో వీళ్లే అనవసరంగా వదంతులకు ఆస్కారం కల్పిస్తున్నారంటూ నయనతార రుసరుసలాడుతున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement