'సై రా' నుంచి తప్పుకున్న ఆస్కార్ విన్నర్ | ARRahman confirms he is not the music director of Syeraa | Sakshi
Sakshi News home page

'సై రా' నుంచి తప్పుకున్న ఆస్కార్ విన్నర్

Nov 26 2017 10:54 AM | Updated on Nov 26 2017 10:54 AM

ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం మరింత భారీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. భారీ బడ్జెట్ తో చారిత్రక చిత్రంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించనున్నాడు చిరు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగి చాలా కాలం అవుతున్నా.. ఇంత వరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. అంతేకాదు సినిమా అధికారిక ప్రకటన వచ్చిన దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు ఒక్కరొక్కరుగా తప్పుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే సినిమాటోగ్రాఫర్ గా రవివర్మన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా ఆయన స్థానంలో రత్నవేలును తీసుకున్నారు. తాజాగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న లైవ్ షో సందర్భంగా మీడియాతో మాట్లాడిన రెహమాన్, ఈ విషయాన్ని ప్రకటించారు. తనకు చిరు అంటే చాలా ఇష్టమన్న రెహమాన్ కేవలం బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలిపారు. మరి రెహమాన్ స్థానం ఏ సంగీత దర్శకుడిని తీసుకుంటారో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement