మందు కొట్టి.. మంత్రి పదవికి రాజీనామా | Swedish minister Aida Hadzialic quits after being caught driving under influence | Sakshi
Sakshi News home page

మందు కొట్టి.. మంత్రి పదవికి రాజీనామా

Aug 14 2016 2:34 AM | Updated on Sep 4 2017 9:08 AM

మందు కొట్టి.. మంత్రి పదవికి రాజీనామా

మందు కొట్టి.. మంత్రి పదవికి రాజీనామా

స్వీడన్ చరిత్రలోనే అతి పిన్న వయసు మంత్రి అయిడా హడ్జియాలిక్(29) మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో...

స్టాక్‌హామ్: స్వీడన్ చరిత్రలోనే అతి పిన్న వయసు మంత్రి అయిడా హడ్జియాలిక్(29) మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో పదవికి రాజీనామా చేశారు. మాధ్యమిక, యువజన విద్యా మంత్రిగా ఉన్న ఆమె శనివారం ఈ విషయం తెలిపారు. ‘మల్మో నగరంలో పోలీసుల తనిఖీల్లో నా రక్తంలో లీటరుకు 0.2 గ్రాముల ఆల్కహాల్ స్థాయి ఉన్నట్లు తేలింది. ఇది నా జీవితంలో అతి పెద్ద తప్పు.  స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నా. నాపై నాకున్న కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని కన్నీటి పర్యంతమయ్యారు. బోస్నియా నుంచి  కుటుంబంతో కలసి ఐదేళ్ల వయసులో స్వీడన్ వలస వచ్చిన ఆమె 23వ ఏట మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2014లో 27వ ఏట ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement