మందు కొట్టి.. మంత్రి పదవికి రాజీనామా
స్టాక్‌హామ్: స్వీడన్ చరిత్రలోనే అతి పిన్న వయసు మంత్రి అయిడా హడ్జియాలిక్(29) మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో పదవికి రాజీనామా చేశారు. మాధ్యమిక, యువజన విద్యా మంత్రిగా ఉన్న ఆమె శనివారం ఈ విషయం తెలిపారు. ‘మల్మో నగరంలో పోలీసుల తనిఖీల్లో నా రక్తంలో లీటరుకు 0.2 గ్రాముల ఆల్కహాల్ స్థాయి ఉన్నట్లు తేలింది. ఇది నా జీవితంలో అతి పెద్ద తప్పు. స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నా. నాపై నాకున్న కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని కన్నీటి పర్యంతమయ్యారు. బోస్నియా నుంచి కుటుంబంతో కలసి ఐదేళ్ల వయసులో స్వీడన్ వలస వచ్చిన ఆమె 23వ ఏట మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2014లో 27వ ఏట ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు.