నీ ముద్దులు నాకే సొంతం!

Parrot Feels Jealous When Her Owner Kissing Toy - Sakshi

అటావా : మనం కోరుకున్నది వేరే వాళ్లకు దక్కినా.. మనకు మాత్రమే సొంతం అనుకున్న వాళ్లు వేరే వాళ్లతో చొరవగా ఉన్నా అసూయపడటం సర్వసాధారణం. అసూయ అన్నది కేవలం మనషులకు మాత్రమే సొంతం కాదని ఓ చిలుక నిరూపించింది. తన యాజమాని వేరే పక్షితో చొరవగా ఉండటాన్ని సహించలేక పోయింది. వివరాల్లోకి వెళితే.. కెనడాకు చెందిన ఆంటారియో అనే వ్యక్తి షాడో అనే చిలుకను పెంచుకుంటున్నాడు. అయితే ఓ రోజు షాడో తన దగ్గర ఉన్నపుడు ఓ బొమ్మపక్షికి ముద్దులు పెడతూ.. గట్టిగా శబ్ధాలు చేయటం ప్రారంభించాడు. ఇది గమనించిన షాడో! యాజమాని ముఖం దగ్గరకు పరుగులు తీసి, బొమ్మను ముక్కుతో పొడిచి ‘‘నీ ముద్దులు నాకే సొంతం’’ అన్నట్లుగా అతన్ని ముద్దుపెట్టుకోవటానికి ప్రయత్నించింది.

ఆంటారియో వెంటనే షాడోను దూరంగా జరిపి మళ్లీ బొమ్మకు ముద్దులు ఇవ్వటం ప్రారంభించగా షాడో మళ్లీ అలాగే చేసింది. ఇలా నాలుగైదుసార్లు జరిగింది. షాడో అసూయ పడటాన్ని చూసి ఆ యాజమాని, అతడి భార్య అలెగ్జాండ్రియా షార్పే థామ్సన్‌ తెగనవ్వేసుకున్నారు. ఈ దృశ్యాలను వీడియో తీసిన అలెగ్జాండ్రియా దాన్ని షాడోకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచింది. దీంతో వీడియో కాస్త వైరల్‌ అయ్యింది. ప్రస్తుతం షాడో ఇన్‌స్టాగ్రామ్‌కు మూడు వేలమంది ఫాలోయర్లు ఉన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top