ఎయిర్పోర్టులో యువకుడి హల్చల్, కాల్పులు | Man shot by police at Love Field airport in Dallas | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్టులో యువకుడి హల్చల్, కాల్పులు

Jun 11 2016 9:22 AM | Updated on Sep 4 2017 2:15 AM

డల్లాస్ లోని విమానాశ్రయంలో హంగామా సృష్టించిన ఓ యువకుడిపై పోలీసులు కాల్పులు జరిపారు.

డల్లాస్: డల్లాస్ లోని విమానాశ్రయంలో హంగామా సృష్టించిన ఓ యువకుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. లవ్ ఫీల్డ్ విమానాశ్రయంలో శుక్రవారం  ఓ యువకుడు 'షూట్ మీ' అని పెద్దగా అరుస్తూ హల్చల్ చేశాడు. అతడు చేతిలో రాయి పట్టుకుని సంచరిస్తూ పెద్ద కేకలు వేయడంతో అతడిని లొంగిపోవాలని పోలీసులు సూచించారు.

అయితే ఆ యువకుడు పోలీసుల హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో అతడిపై పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. అనంతరం అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు స్థానికి టీవీ ఒక కథనాన్నిప్రసారం చేసింది. కాల్పుల అనంతరం విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.  మరోవైపు అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేదు. ఈ ఘటనపై స్పందించడానికి ఎయిర్ పోర్ట్  అధికారులు అందుబాటులో లేరు.

Advertisement

పోల్

Advertisement