
పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బషీత్
ఇండియాలో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బసిత్ సోమవారం చేసిన ఓ ట్వీట్ పొరుగు దేశాన్ని నవ్వులపాలు చేసింది.
ఇస్లామాబాద్ : భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో దాయాది దేశం చిల్లర వేషాలు మానడం లేదు. ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడి నుంచి నెలక్రితం కశ్మీర్ అంశంలో ఆర్టికల్ 370 రద్దు దాకా భారత్‌పై బురద జల్లేందుకు పాక్ గుంటనక్కలా కాచుకుని కూచుంది. ఇక మన దేశంతో ఏ రీతిన నడుచుకోవాలో అంతుబట్టక పాకిస్తాన్ నాయకులు రోజుకో మాట మాట్లాడుతున్న తరుణంలో ఇండియాలో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బసిత్ సోమవారం చేసిన ఓ ట్వీట్ పొరుగు దేశాన్ని నవ్వులపాలు చేసింది.
పోర్న్ స్టార్ జానీ సిన్స్ ఫొటోతో కూడిన ట్వీట్‌ను ఆయన రీట్వీట్ చేస్తూ.. ‘కశ్మీర్‌లో ఎంత అరాచమో చూడండి. అనంతనాగ్‌లో యూసుఫ్ అనే వ్యక్తి బుల్లెట్ గాయాలతో కంటి చూపు కోల్పోయాడు. అతని కుటుంబ సభ్యుల వేదన చూడండి. ఇప్పటికైనా నోరు విప్పండి. అన్యాయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లండి’అన్నారు. బషీత్ తప్పిదాన్ని పసిగట్టిన ఆ దేశ జర్నలిస్టు నైనా ఇనాయత్... పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బసిత్ పప్పులో కాలేశారు. ఆయన ట్వీట్ చేసింది పోర్న్ స్టార్ జానీ సిన్స్ ఫొటో. అసత్య ప్రచారమంటే ఇదే కావొచ్చు’అని ట్వీట్ చేశారు.
Former Pakistani high commissioner to India Abdul Basit, mistakes Johnny Sins for a Kashmiri man who lost vision from pellet. Unreal times these, really. pic.twitter.com/9h1X8V8TKF
— Naila Inayat नायला इनायत (@nailainayat) September 2, 2019