
నారాయణ విద్యార్థుల వీరంగం
హైదరాబాద్లో నిజాంపేటలోని నారాయణ విద్యార్థులు వీరంగం సృష్టించారు.
హైదరాబాద్ :
హైదరాబాద్లో నిజాంపేటలోని నారాయణ విద్యార్థులు వీరంగం సృష్టించారు. మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఔటింగ్ ఇవ్వలేదని ఒక్కసారిగా వందలాది విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా ఔటింగ్ ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తోందని విద్యార్థులు మండిపడ్డారు.కాలేజీ గేటుకు తాళాలు వేసి ఫర్నిచర్, లైట్లను ధ్వంసం చేశారు.కాలేజీ స్టాఫ్ సిబ్బందిని విద్యార్థులు గదిలో నిర్భందించారు.
అడ్డుకున్న పోలీసులపై రాళ్లురువ్వారు. దీంతో యాజమాన్యం ఔటింగ్ ఇవ్వడానికి ఒప్పుకోవడంతో విద్యార్థులు ఆందోళనను విరమించారు.