పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనాలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు ఇంతవరకూ
పోలవరంపై ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనాలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు ఇంతవరకూ అందలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి సోమవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ సంజీవ్‌కుమార్ బల్యన్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
2005–06 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ. 10,151.04 కోట్లు అని మంత్రి వెల్లడించారు. ఆ తరువాత 2010–11లో అంచనా వ్యయం రూ 16,010.45 కోట్లకు పెరిగిందని వివరించారు. ఆ తదుపరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి పెంపు ప్రతిపాదనలు అందలేదని ఆయన తెలిపారు.