నగరంలోని పాతబస్తీలో డ్రగ్ కల్చర్ పడగవిప్పుతోంది. చాంద్రాయణగుట్టలో కొత్తదారుల్లో మాదక ద్రవ్యాల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో డ్రగ్ కల్చర్ పడగవిప్పుతోంది. చాంద్రాయణగుట్టలో కొత్తదారుల్లో మాదక ద్రవ్యాల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. మెడికల్ షాపులను అడ్డగా చేసుకున్న డ్రగ్స్ ముఠా మాదక ద్రవ్యాల విక్రయాలను యధేచ్చగా జరుపుతోంది. డ్రగ్స్ అమ్మకాలపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు.
అందులో భాగంగా మంగళవారం పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో ఓ మెడికల్ షాపుపై దాడులు జరిపారు. మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న మెడికల్ షాపు యాజమాని, ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ట్యాబ్లెట్స్, టానిక్స్, ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.