కేంద్రానికి కరువు నివేదికివ్వాలి : చాడ | Chada venkata reddy about Drought | Sakshi
Sakshi News home page

కేంద్రానికి కరువు నివేదికివ్వాలి : చాడ

Nov 20 2016 3:13 AM | Updated on Aug 14 2018 2:34 PM

కేంద్రానికి కరువు నివేదికివ్వాలి : చాడ - Sakshi

కేంద్రానికి కరువు నివేదికివ్వాలి : చాడ

తెలంగాణ నుంచి కరువు నివేదిక రాలేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పేర్కొనడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.

సాక్షి,, హైదరాబాద్: తెలంగాణ నుంచి కరువు నివేదిక రాలేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పేర్కొనడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కేంద్రానికి వెంటనే కరువు నివేదికను పంపించా లని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రూ.790 కోట్లు కరువు నిధులు వచ్చినప్పటికీ పంట నష్టం అందించకపోవడం దుర్మార్గమని ఒక ప్రకటనలో విమర్శించారు. కాగా, పార్టీ జిల్లాల కార్యదర్శులను ఎంపిక చేసినట్లు చాడ తెలిపారు. మంచిర్యాల-కళావేణి శంకర్, అసిఫాబాద్- కొమురంభీమ్-సత్యనారాయణ,ఆదిలాబాద్-ప్రభాకర్‌రెడ్డి, నిర్మల్-ఎంఎన్‌రెడ్డి (కన్వీనర్),సిద్దిపేట-పవన్,సంగారెడ్డి-జలాలుద్దీన్,మెదక్-రాజిరెడ్డి, నల్లగొండ- నర్సింహారెడ్డి, యాదాద్రి- శ్రీరాములు, సూర్యాపేట- గన్నా చంద్రశేఖర్‌లను జిల్లా కార్యదర్శులుగా ఎంపిక చేశామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement