సెల్ఫీ దిగుతూ.. టాటా చెబుతూ.. | Cab Driver Commits Suicide Due To Financial Issues | Sakshi
Sakshi News home page

సెల్ఫీ దిగుతూ.. టాటా చెబుతూ..

Nov 10 2016 12:24 AM | Updated on Oct 2 2018 5:51 PM

సెల్ఫీ దిగుతూ.. టాటా చెబుతూ.. - Sakshi

సెల్ఫీ దిగుతూ.. టాటా చెబుతూ..

ఆర్థిక ఇబ్బందులతో ఓ క్యాబ్ డ్రైవర్ ఆత్మ హత్య చేసుకున్నాడు. మెడకు ఉరితాడు బిగించుకుని.. ఒకచేతిలో సెల్‌ఫోన్,

 హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో ఓ క్యాబ్ డ్రైవర్ ఆత్మ హత్య చేసుకున్నాడు. మెడకు ఉరితాడు బిగించుకుని.. ఒకచేతిలో సెల్‌ఫోన్, మరో చేతితో టాటా చెబుతూ సెల్ఫీ దిగుతూ మృత్యుఒడిలోకి జారుకున్నాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసు కుంది. నల్లగొండ జిల్లా చిట్యాల ప్రాంతానికి చెందిన కృష్ణ స్వామి కుమారుడు  కె.క్రాంతికుమార్ (28) పొట్టచేత బట్టుకొని హైదరాబాద్‌కు వలస వచ్చాడు. రామంతా పూర్‌లో ఉంటూ క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
 
 కొంత కాలంగా మానసికంగా ఇబ్బందిపడుతున్న క్రాంతికి రానురాను ఏమై పోతాననే బెంగపట్టుకుంది. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లగా మంగళవారం రాత్రి ఇంట్లో సెల్ఫీ దిగుతూ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోతూ క్రాంతి సెల్ఫీ దిగిన చిత్రాలు సెల్‌ఫోన్‌లో కనబ డ్డాయి. సూసైడ్‌నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement