శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు | celebrities visit in tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

Feb 7 2016 11:10 AM | Updated on Aug 31 2018 9:02 PM

తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హై కోర్టు న్యాయమూర్తులు శివ శంకర్ రావు, సీతారామారావు, దుర్గాప్రసాద్‌లు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం 36 మంది శిక్షణలో ఉన్న ఐఏఎస్‌లు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. వీరితో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా ఐటీ ప్రొఫెసర్ కె. నర్సింహారావు, రాయలసీమ ఐజీ గోపాలక్రిష్ణ, గుజరాత్ రాష్ట్ర డీజీపీ పాండ్యన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి, ఉడిపి కి చెందిన పుత్తిగ మఠ పీఠాధిపతి సుగునేంద్రస్వామి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జే. చైదరి స్వామివారిని దర్శించుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement