
- ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణకు సిటీ కాలేజి మఖ్దూమ్ మొహియుద్దీన్ నేషనల్ అవార్డును ఆగస్ట్ 27న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సిటీ కాలేజీలోని గ్రేట్ హాల్‌లో ప్రదానం చేయనున్నారు. ముఖ్య అతిథి: నందిని సిధారెడ్డి.
- దేవిప్రియ లవ్ పోయెమ్స్ సంకలనం ‘స్లీపింగ్ విత్ ద రెయిన్‌బో’ ఆవిష్కరణ ఆగస్ట్ 28న సా‘‘ ఆరింటికి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. ఆంగ్లానువాదం: విజయ్ కోగంటి. ముఖ్య అతిథి: మాధవ్ కౌశిక్. నిర్వహణ: సమతాబుక్స్, ఛాయ.
- గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆగస్ట్ 29న ఉదయం 10 గంటలకు గుంటూరులోని యూటీఎఫ్ హాలులో ‘తెలుగు భాషాదినోత్సవం’ జరపనుంది. తెలుగు భాష కోసం కృషి చేసినవారికి సత్కారం, కవి సమ్మేళనం ఉంటాయి.
- గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో ఆగస్టు 29న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గిడుగు జయంతి ఉత్సవాలు జరగనున్నాయని ఆర్గనైజింగ్ సెక్రటరీ బిక్కి కృష్ణ తెలియజేస్తున్నారు.
- ‘సమకాలీన కథ’పై రాష్ట్రస్థాయి సదస్సు సెప్టెంబర్ 1న ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరగనుంది. ముఖ్య అతిథులు: వాడ్రేవు చినవీరభద్రుడు, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, పాపినేని శివశంకర్. నిర్వహణ: జానుడి, శాంతివనం, కథా ప్రకాశం.
- తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా) నిర్వహించిన కథల పోటీలో ముప్పై వేల రూపాయల మొదటి బహుమతిని ‘కొండ’ కథకుగానూ పూడూరి రాజిరెడ్డి గెలుచుకున్నారు. ఇరవై వేల రెండవ బహుమతి ‘రాగరాగిణి’కిగానూ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తికి దక్కింది. పదిహను వేల 2 మూడవ బహుమతులను వి–రాగి (ఈ గాయమెంత తియ్యనో), కె.ఎ.మునిసురేశ్ పిళ్లె (వరాలత్త గాజులు) గెలుచుకున్నారు. పది వేల విశిష్ట రచనకు జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తిదే మరోకథ ఎంపిక కాగా; ఐదు వేల ప్రోత్సాహక బహుమతులకు వసుంధర, జగన్ మిత్ర, ఎండపల్లి భారతి, అరుణ పప్పు, వెంకటమణి ఈశ్వర్, కె.వరలక్ష్మి కథలుఎంపికైనాయి. తెల్సా బృందం మురళి చందూరి, పద్మ ఇంద్రగంటి, బాపారావు కొచ్చెర్లకోట ఈ ఫలితాలను ప్రకటించారు.