పోలింగ్ అధికారిని కాటేసిన పాము | snake bites polling officer in mahabubnagar district | Sakshi
Sakshi News home page

పోలింగ్ అధికారిని కాటేసిన పాము

Apr 30 2014 11:05 AM | Updated on Oct 8 2018 5:04 PM

పోలింగ్ అధికారిని కాటేసిన పాము - Sakshi

పోలింగ్ అధికారిని కాటేసిన పాము

మహబూబ్‌నగర్ జిల్లాలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో పాము కలకలం సృష్టించింది.

మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్ జిల్లాలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో పాము కలకలం సృష్టించింది. కేశంపేట మండలం దేవునిగుడి తండాలో పోలింగ్ అధికారి హుసలయ్యను పాము కరిచింది. వెంటనే హుసలయ్యను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంఓని తొండుపల్ల పోలింగ్ కేంద్రం ఆవరణలో నిన్న ఓ నాగుపాము కలకలం సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రెండు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం ఎన్నికల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

వారు సామాగ్రి సర్దుకుంటుండగా బూత్ల పక్కనే ఉన్న ఓ గదిలో పాము కనిపించింది. దీంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. నాగుపాము కుబుసంతో ఉండటంతో కదలకుండా కొన్ని గంటలపాటు అక్కడే ఉంది. ఎలాగోలా కష్టపడి దానిని అక్కడి నుంచి తప్పించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement