సీఎంగా బాబాయ్.. కాదు మావయ్య | Nandamuri Balakrishna become a Chief Minister, says Actor Tarakaratna | Sakshi
Sakshi News home page

సీఎంగా బాబాయ్.. కాదు మావయ్య

Apr 23 2014 6:02 PM | Updated on Apr 3 2019 8:56 PM

సీఎంగా బాబాయ్.. కాదు మావయ్య - Sakshi

సీఎంగా బాబాయ్.. కాదు మావయ్య

టీడీపీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరనే దానిపై సినీ నటుడు తారకరత్న మీడియా ఎదుట తడబడ్డారు. బాబాయ్ అని... అంతలోనే కాదుకాదు మామయ్య అని అన్నారు.

హిందూపురం: టీడీపీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరనే దానిపై సినీ నటుడు తారకరత్న మీడియా ఎదుట తడబడ్డారు. బాబాయ్ అని... అంతలోనే కాదుకాదు మామయ్య అని అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించడానికి మంగళవారం ఉదయం ఆయన ఇక్కడికొచ్చారు. ఇక్కడి టీడీపీలో నాలుగు వర్గాలున్న నేపథ్యంలో ఎవరూ  రోడ్ షోకు అనుమతి తీసుకోలేదు. దీంతో లాడ్జికే పరిమితమైన తారకరత్న.. మీడియాతో మాట్లాడుతూ బాబాయ్ బాలకృష్ణను సీఎంగా చూడాలని ఉందని చెప్పారు.

మరి చంద్రబాబు సంగతేంటని విలేకరులు ప్రశ్నించే సరికి.. చంద్రబాబు సీఎం కావాలన్నారు. అదేంటి ఇద్దరి పేర్లు చెబుతున్నారని అడిగితే, టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి విషయం గురించి బాబాయ్ బాలకృష్ణ, మావయ్య చంద్రబాబు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటారని సమాధానమిచ్చారు. తారకరత్న సమాధానాలు విన్న టీడీపీ నేతలు.. ఇక ముగించండంటూ సైగలు చేశారు. పోలీసులు చివరకు సాయంత్రం అనుమతి ఇవ్వడంతో కాసేపు ఆయన రోడ్ షో నిర్వహించగా జనం లేక వెలవెలబోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement