బీజేపీకి ఓటేస్తే.. టీడీపీకి వేసినట్టే | K Chandra Sekhar rao takes on BJP, TDP | Sakshi
Sakshi News home page

బీజేపీకి ఓటేస్తే.. టీడీపీకి వేసినట్టే

Apr 16 2014 8:55 PM | Updated on Mar 29 2019 9:24 PM

బీజేపీకి ఓటేస్తే.. టీడీపీకి వేసినట్టే - Sakshi

బీజేపీకి ఓటేస్తే.. టీడీపీకి వేసినట్టే

భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టేనని టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు అన్నారు.

మహబూబ్నగర్: భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టేనని టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొన్నారు.

చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడినట్టు ఫరేఖ్ రాసిన పుస్తకంలో స్పష్టమైందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నిజాం షుగర్స్ను అమ్మిన చంద్రబాబుకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి, నాగర్ కర్నూల్లను ప్రత్యేక జిల్లాలను చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement