రీనాక్ పర్వతారోహణకు గిరిజన విద్యార్థిని ఎంపిక

రీనాక్ పర్వతారోహణకు గిరిజన విద్యార్థిని ఎంపిక


ఇచ్చోడ: హిమాలయూల్లోని రీనాక్ పర్వతారోహణకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గిరిజన బాలికల గురుకుల పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని సిడాం అంజలి ఎంపికైంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ పర్వతారోహణకు 31 మంది ఎంపిక కాగా.. వీరిలో అంజలి ఒకరు. జైనుర్ మండలం గౌరి గూడేనికి చెందిన ఆదిమ గిరిజన తెగలో అత్యంత వెనకబడిన కొలాం తెగకు చెందిన వ్యవసాయ కూలీ దంపతులు సిడాం దేవా,  సునీత దంపతుల కూతురు అంజలి. ప్రిన్సిపల్ మూర్తుజాఖాన్ ప్రత్యేక శ్రద్ధ కనబర్చి ప్రోత్సహించారు. అక్టోబర్‌లో భువనగిరి కోట వద్ద ప్రత్యేక శిక్షణలో ప్రతిభ కనబర్చడంతో హిమాలయ అధిరోహణకు ఎంపిక చేశారు.సముద్రమట్టానికి 17,000 మీటర్ల ఎత్తరుున రీనాక్ పర్వతాన్ని అంజలి అధిరోహించనుంది. ఈ నెల 21న 31 మంది విద్యార్థుల బృందం డార్జిలింగ్ చేరుకుని డిసెంబర్ 10 వరకు అక్కడే ఉంటారు. హిమాలయ అధిరోహణ తర్వాత తిరిగి వస్తారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top