రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవస్థానానికి సంబంధించిన భూములు కౌలుకు ఇచ్చేందుకు జరిగిన బహిరంగ వేలంలో ఆలయానికి భారీ రాబడి వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీరామమూర్తి తెలిపారు.
పెంచలకోన దేవస్థానానికి భారీ రాబడి
Jul 26 2016 1:15 AM | Updated on Sep 4 2017 6:14 AM
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన దేవస్థానానికి సంబంధించిన భూములు కౌలుకు ఇచ్చేందుకు జరిగిన బహిరంగ వేలంలో ఆలయానికి భారీ రాబడి వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీరామమూర్తి తెలిపారు. ప్రకాశం జిల్లా పోన్నూరూ మండలం ముప్పాళ్ల పంచాయతీ తింగరబోట్ల పాళెంలో సోమవారం వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారికి ప్రకాశం జిలా ్ల పొన్నూరు మండలం ముప్పాళ్ల పంచాయతీ తింగరబోట్ల పాళెంలో 55 ఎకరాల 70 సెంట్లు భూమి ఉందని, ఈ భూమిని 2016 నుంచి 2019 వరకు కౌలుకు ఇచ్చేందుకు వేలం నిర్వహించారన్నారు. ఎకరా భూమి ఏడాదికి రూ.7.లక్షలా7వేల 500లు వంతున రైతులు వేలం పాడారన్నారు. మూడేళ్లకు గాను రూ.21,220,500లు చెల్లిస్తారన్నారు. ఈ ఏడాది అదనంగా రూ.2,44,500లు పేరిగిందన్నారు. వేలంలో పాలకవర్గ సభ్యులు సోమయ్య, కందుకూరు గ్రూపు టెంపుల్ సీవో నారాయణరెడ్డి, దేవస్థాన సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌నాయుడు పాల్గొన్నారు.
Advertisement
Advertisement