
పాకిస్తాన్ దిష్టిబొమ్మ దహనం
ఉగ్రవాదన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాలు బహిష్కరించాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగు నర్సింహరెడ్డి కోరారు. మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బీజేపీ, ఏబీవీపీ ఆధ్వర్యంలో పాకిస్తాన్ దిష్టి బొమ్మను దహనం చేశారు.
శంకర్‌పల్లి: ఉగ్రవాదన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాలు బహిష్కరించాలని బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగు నర్సింహరెడ్డి కోరారు. మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బీజేపీ, ఏబీవీపీ ఆధ్వర్యంలో పాకిస్తాన్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాద దాడి నేపథ్యంలో 18 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న పాకిస్తాన్‌ను ప్రతిఒక్కరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. త్వరలో పాకిస్తాన్‌కు భారత్ సరియైన రీతిలో బుద్ధి చెబుతుందన్నారు. సైనికుల ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. అనంతరం పాకిస్తాన్ జాతీయజెండా, దిష్టి బొమ్మను దహనం చేశారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జయరాంరెడ్డి, శ్రీపాల్‌రెడ్డి, రాజేష్‌గౌడ్, అమరేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, మండల ఎబీవీపీ కన్వీనర్ సాకేత్‌రెడ్డి, సభ్యులు నవీన్, శరత్, శివ, అమరేందర్, రాజు, తిరుపతి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.