కోటి 11 లక్షలు మొక్కలు నాటేందుకు ప్రణాళిక | One crore 11 lakh plants for palnting | Sakshi
Sakshi News home page

కోటి 11 లక్షలు మొక్కలు నాటేందుకు ప్రణాళిక

Nov 18 2016 12:21 AM | Updated on Sep 4 2017 8:22 PM

కోటి 11 లక్షలు మొక్కలు నాటేందుకు ప్రణాళిక

కోటి 11 లక్షలు మొక్కలు నాటేందుకు ప్రణాళిక

2017 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా కోటి 11 లక్షల మొక్కలు నాటేందుకు ముందస్తు ప్రణాళిక తయారు చేశామని అటవీ సంరక్షణాధికారి(సీసీఎఫ్) పి.రాజేశ్వరి తెలిపా రు.

పాతపట్నం: 2017 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా కోటి 11 లక్షల మొక్కలు నాటేందుకు ముందస్తు ప్రణాళిక తయారు చేశామని అటవీ సంరక్షణాధికారి(సీసీఎఫ్) పి.రాజేశ్వరి తెలిపా రు. స్థానిక వెంకటేశ్వర ఆలయం వెనుక అటవీ శాఖ ఆధ్వర్యంలోని నర్సరీని ఆమె బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 20 లక్షల సరుగుడు మొక్కలు, 40 లక్షలు వేప, చింత, కా ము, మద్ది, నెరేడు మొక్కలతో పాటు పండ్ల తోటలు, ఔషధ మొక్కలను సిద్ధం చేస్తున్నామన్నారు. దోమల ని వారణకు నిమ్మగడ్డిను పెంచుతున్నామని చెప్పారు. పాతపట్నం నర్సరీలో 100 బెడ్సు, 8 ఇంటు 12 బెడ్సులు ఉన్నాయన్నారు. ఆమె వెంట సోషల్ ఫారెస్టు అధికారి కె.లోహిదాస్యుడు, పాతపట్నం, టెక్కలి ఫారెస్టు రేంజర్లు ఎంవీఎస్ సోమశేఖర్, ఎం.సంజయ్, పారెస్టు సెక్షన్ అధికారి బి.రామమూర్తి, బీటు అధికారి జి.కృష్ణప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
 
రుద్రజడ మొక్కల పెంపకంతో దోమల నివారణ
సారవకోట: ఇళ్ల పరిసరాల్లో రుద్రజడ మొక్కల పెంపకం వల్ల దోమలను నివారించవచ్చని అటవీ సంరక్షణాధికారి రాజ్వేరి తెలిపారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం చుట్టూ చేసిన బయో పెన్సింగ్, నారాయణపురంలోని నర్సరీలను పరిశీలించారు. వచ్చే ఏడాది రుద్రజడ మొక్కల పెంపకానికి ప్రాధాన్యమిస్తామన్నారు. జిల్లాలోని నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల చుట్టూ బయోపెన్సింగ్ చేపడతామన్నారు. నర్సరీల్లో 1.50 కోట్లు మొక్కలు పెంపకం చేశామని, వీటిలో 1.12 కోట్లు మొక్కలను పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం టేకు మొక్కలు 2.5 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 90 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు కిరువైపుల మొక్కలునాటే కార్యక్రమం పూర్తిచేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement