
ఆ అడుగులు జంగపిల్లివే..!
అహ్మద్‌గూడ గ్రామ పరిసరాల్లో పులిసంచారం వట్టిదేనని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ భిక్షపతి అన్నారు.
గ్రామంలోని కొత్త చెరువు సమీపంలో పులి అడుగులుగా గ్రామస్తులు పేర్కొన్న అడుగులను పరిశీలించడం జరిగిందన్నారు. అవి పులి అడుగులు కావని జంగపిల్లి అడుగులుగా గుర్తించినట్లు చెప్పారు. పులి సంచారం అన్న పుకార్లను నమ్మొద్దని సూచించారు.