
ఆటోను ఢీకొన్న లారీ: నలుగురి మృతి
నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో గురువారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది.
మెదక్: నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో గురువారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. మృతులు కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.