ప్రకాశం జిల్లాలోని పద్మావతి నర్సింగ్‌హోంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది.
ఒంగోలు(ప్రకాశం): ప్రైవేట్ ఆస్పత్రిలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించటంతో ఎటువంటి నష్టం సంభవించలేదు. ఒంగోలులోని పద్మావతి నర్సింగ్ హోంలో మంగళవారం ఉదయం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగింది.
చిన్నారులను ఉంచే ఇంక్యుబేటర్ రూంలో విద్యుత్ వైర్లు కాలిపోవటంతో పొగలు వచ్చాయి. అయితే, సిబ్బంది అప్రమత్తమై గదిలో ఉన్న చిన్నారులను మరో గదిలోకి తరలించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు.