సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు | fire accident at power sub station, number of transformers burnt | Sakshi
Sakshi News home page

సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు

Jul 22 2015 7:17 PM | Updated on Sep 18 2018 8:38 PM

పట్టణంలోని కర్నూలు రోడ్డు వద్ద గల విద్యుత్ సబ్ స్టేషన్లో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది.

ఒంగోలు: పట్టణంలోని కర్నూలు రోడ్డు వద్ద గల విద్యుత్ సబ్ స్టేషన్లో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేనప్పటికీ భారీగా ఆస్తి నస్ఠం సంభవించింది. పదుల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి.

ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతుచేసే షెడ్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్పారు. సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. అయితే ఏ మేరకు ఆస్తి నష్టం జరిందనే వివరాలు ఇప్పుడు చెప్పలేమని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement