మండలంలోని రెంజర్ల కోదండ రామాలయంలో గురువారం అర్ధరాత్రి దుండగులు చొరబడి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు.
రామాలయంలో చోరీ
Aug 5 2016 10:45 PM | Updated on Sep 4 2017 7:59 AM
	బాల్కొండ : మండలంలోని రెంజర్ల కోదండ రామాలయంలో గురువారం అర్ధరాత్రి దుండగులు చొరబడి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం పూజ చేసేందుకు ఆలయ పూజారి వేణు వెళ్లేసరికి ఆలయ తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో పూజారి గ్రామస్తులకు సమాచారం అందించడంతో గ్రామస్తులు బాల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్సై ఇంద్రకరణ్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీత, రామ లక్ష్మణ విగ్రహాల కిరీటాలు, శఠగోపం, మంగళహారతులు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
