ప్రజల కోసం కాదు.. కాంట్రాక్టుల కోసమే.. | CPM Leaders b v raghavulu and chada venkat reddy takes on kcr | Sakshi
Sakshi News home page

ప్రజల కోసం కాదు.. కాంట్రాక్టుల కోసమే..

May 5 2016 6:17 PM | Updated on Aug 15 2018 9:30 PM

రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే... పాలేరు ఉప ఎన్నికలో మండలానికో మంత్రి ప్రచారం చేస్తున్నారని సీపీఎం నేతలు బి.వి. రాఘవులు, చాడ వెంకటరెడ్డి ఆరోపించారు.

ఖమ్మం : రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే... పాలేరు ఉప ఎన్నికలో మండలానికో మంత్రి ప్రచారం చేస్తున్నారని సీపీఎం నేతలు బి.వి. రాఘవులు, చాడ వెంకటరెడ్డి  ఆరోపించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో వారు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బి.వి.రాఘవులు మాట్లాడుతూ... కేసీఆర్ కేబినెట్లో మహిళకు చోటు లేకపోవడం శోచనీయమని అన్నారు.

ప్రజల కోసం ప్రాజెక్టులు చేపట్టడం లేదని... కాంట్రాక్టుల కోసమే ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేస్తున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. ఉస్మానియాకు టీఆర్ఎస్ నేతలు వెళ్లితే తరిమికొడతారని హెచ్చరించారు. కేసీఆర్కు చెక్ పెట్టడమే ధ్యేయంగా ఇకపై వామపక్షాలు పనిచేస్తాయని చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement