మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది.
మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో ఓ మహిళ దారుణంగా హత్యకు గురైంది. మండల కేంద్రంలోని వడ్డెవాడ సమీపంలోని ముళ్ల పొదల్లో ఓ మహిళ(50) మృత దేహం పడి ఉండగా గురువారం ఉదయం స్థానికులు కనుగొన్నారు. ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఆమె స్థానికురాలు కాదని చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవాల్సి ఉంది.