 
															వెనక్కి తొక్కితే ముందుకు దూసుకెళ్తుంది!
కొందరు యువకులు వినూత్న ప్రయోగాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. అలాంటి వారిలో పృథ్వీరాజ్ కుమార్ ఒకరు.
	ఆత్మకూరు (అనంతపురం): కొందరు యువకులు వినూత్న ప్రయోగాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. అలాంటి వారిలో పృథ్వీరాజ్ కుమార్ ఒకరు. ఆత్మకూరు మండల కేంద్రానికి ఇతను తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చేశాడు. వినూత్న ప్రయోగాలపై ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలోనే నెల రోజుల పాటు కష్టపడి తన సైకిల్‌ను వినూత్నంగా మార్చాడు. ఈ సైకిల్‌ను వెనక్కి తొక్కితే సాధారణం కంటే రెట్టింపు వేగంతో ముందుకు దూసుకెళుతుంది. సైకిల్‌కు మూడు  చైన్లను అమర్చాడు.
	
	బార్‌కడ్డీలకు మధ్యలో రేకు బిగించాడు. ఆ రేకుకు,  చైన్లకు అనుసంధానం చేశాడు. ఫెడల్‌ను ఎంత వెనక్కు తొక్కితే అంతకు రెట్టింపు వేగంతో ముందుకు వెళ్లేలా తీర్చిదిద్దాడు. దీనిద్వారా పెద్ద మిట్టలను సైతం సునాయాసంగా అధిగమించవచ్చు. దీంతోనే బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేలా ప్రయత్నిస్తున్నట్లు పృథ్వీరాజ్ చెప్పాడు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
