
సాక్షి, శ్రీకాకుళం: పోలీసుల వేధింపులు తాళలేక ఓ వైఎస్సార్ సీపీ కార్యకర్త పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. సుంకు అప్పారావు అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తను టీడీపీ నేత వేధింపులలో భాగంగా రెండు రోజులు పోలీస్ స్టేషన్‌లో నిర్భందించారు.
లాయర్లతో వెళ్లిన వైఎస్సార్ సీపీ నేతలు, మీడియాపై సైతం పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో మనస్తాపం చెందిన అప్పారావు రణస్థలం పోలీస్ స్టేషన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.