చెట్టుకు కట్టేసి.. రాయితో కొట్టి హత్య | man attacked another man for wife illegal affair | Sakshi
Sakshi News home page

జనం ముందు చెట్టుకు కట్టేసి.. రాయితో కొట్టి హత్య

Nov 3 2017 8:15 AM | Updated on Oct 9 2018 5:39 PM

man attacked another man for wife illegal affair - Sakshi

సాక్షి, బెంగళూరు (బాగలకొటె): తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఒక వ్యక్తిని గ్రామంలో చెట్టుకు కట్టివేసి దారుణంగా కొట్టిచంపాడో వ్యక్తి. గ్రామస్తులు చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవరూ దీనిని అడ్డుకోలేదు. బాగల్‌కోటె జిల్లాలో బాదామి తాలూకాలో ఉన్న నెలవిగి గ్రామంలో మంగళవారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హతుడు మల్లప్ప హొరకేరి కాగా, నిందితుడు ఆదప్ప మిడి. ఈ హత్యోదంతాన్ని కొందరు సెల్‌ఫోన్లో వీడియో తీసి పోస్ట్‌ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో సంచలనాత్మకమైంది. తన భార్యతో మల్లప్ప అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆదప్ప అనుమానించసాగాడు.

దీనిపై అతన్ని పలుమార్లు మందలించాడు కూడా. అయినా పద్ధతి మార్చుకోలేదని ఆదప్ప ఆగ్రహంతో ఉన్నాడు. మంగళవారం ఉదయం ఇద్దరి మధ్య గ్రామంలోనే గొడవ జరిగింది. ఆగ్రహంతో ఆదప్ప మల్లప్పను కొట్టి లాక్కు  వచ్చి గ్రామం మధ్యలోనున్న వేపచెట్టుకు కట్టివేసి తలపైన పెద్ద రాయితో కొట్టాడు. దీంతో మల్లప్ప అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. గ్రామస్తులు ఊరికే చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవరూ అడ్డుకోలేదు. కొందరు ఫోన్లలో వీడియో తీశారు. బాదామి పోలీసులు గ్రామానికి వచ్చి ఆదప్పను అకరదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement