ఫ్యాన్‌కు ఉరివేసుకున్న 14 ఏళ్ల బాలుడు  | 14 Year Boy Takes Life In Machilipatnam | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు చదువుకోమన్నారని..

May 23 2020 6:06 PM | Updated on May 23 2020 6:24 PM

14 Year Boy Takes Life In Machilipatnam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కృష్ణా : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు చదువుకోమని మందలించటంతో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మచిలీపట్నంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మచిలీపట్నం బ్రహ్మపురానికి చెందిన 14 ఏళ్ల బాలుడ్ని తల్లిదండ్రులు చదువుకోమని మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాలుడి ఆత్మహత్య ఘటనపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు కంటతడి పెట్టుకున్నారు.

చదవండి : డ్రైవర్‌ అప్రమత్తత: 28 మంది సేఫ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement