పండుగ సీజన్‌ : ఎస్‌బీఐ తీపి కబురు 

SBI offers lower interest rates on loans during festive season - Sakshi

సాక్షి, ముంబై :  అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పండుగ సీజన్‌ సందర్భంగా కార్ల రుణాలపై  ప్రాసెసింగ్‌ ఫీజను రద్దు చేసినట్టు   ప్రకటించింది. రానున్న దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఎస్‌బీఐ ముందుగానే తన కస్టమర్లకు ఈ తీపి కబురు అందించింది.  కార్ల రుణాలపై  8.70 శాతం  వడ్డీని వసూలు చేయనుంది. యోనో యాప్ లేదా బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కారు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్లకు వడ్డీ రేటుపై మరో 25 బీపీఎస్‌ పాయింట్ల రాయితీ లభిస్తుంది. అలాగే వేతన జీవులైన బ్యాంకు కస్టమర్లు కారు ఆన్-రోడ్ ధరలో 90 శాతం వరకు రుణాన్ని పొందవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top