శాంసంగ్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఫోటోలు లీక్‌

Samsung to launch mid-range 5G phone Report  - Sakshi

సియోల్‌ : దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ‘ఎ’ సిరీస్‌లో మరో ఫోన్‌ను పరిచయం చేయబోతోంది. శాంసంగ్‌ గెలాక్సీ ఏ90 పేరుతో దీన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్‌ 5జీ టెక్నాలజీతో వస్తున్న , అంత్యంత సరసమైన  మొబైల్‌ లని తాజా నివేదికల సారాంశం.  అయితే లాంచింగ్‌ తేదీని  కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.  ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన  అధికారిక పోస్టర్‌, రీటైల్‌ బాక్స్‌తోపాటు  కొన్ని ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి.  దీని ప్రకారం స్లిమ్‌ బెజెల్స్‌ ఇన్‌ఫినిటీ యూ డిస్‌ప్లే, ట్రిపుల్‌ రియర్‌ కెమెరా, సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్  ప్రధాన ఆకర్షణ కానున్నాయి. అయితే  ధర, బ్యాటరీ సామర్థ్యం లాంటి ఇతర సమాచారం వెల్లడి కావాల్సి వుంది. అలాగే ఇండియాలో 5జీ వచ్చే ఏడాది నాటికి సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో  శాంసంగ్‌ ఏ 90 4జీ వేరియంట్‌ను ఇండియాలో తీసుకొస్తుందా లేదా, వచ్చే ఏడాది దాకి వెయిట్‌ చేస్తుందా  అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. 

శాంసంగ్‌ ఏ 90  ఫీచర్లు 

6.7 అంగుళాల  అమోలెడ్‌ డిస్‌ప్లే
ఆక్టా-కోర్ చిప్ (బహుశా స్నాప్‌డ్రాగన్ 855)
8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ 
48+8+5 ఎంపీ రియర్‌ కెమెరా 
32 ఎంపీ సెల్ఫీ కెమెరా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top