రియల్‌ మి 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఈ ఏడాదిలోనే | Realme to launch its first 5G handset in 2019  | Sakshi
Sakshi News home page

రియల్‌ మి 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఈ ఏడాదిలోనే

Jun 7 2019 5:04 PM | Updated on Jun 7 2019 5:10 PM

Realme to launch its first 5G handset in 2019  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రియల్‌మి  ఇండియా తన తొలి  5 జీ  స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే లాంచ్‌ చేయనుంది. 5జీ ప్రొడక్టులను ఈ ఏడాదిలోనే  ఆవిష్కరించబోతున్నామని రియల్మి ఇండియా  సీఎండీ మాధవ్ సేథ్‌  ప్రకటించారు. స్కైలితో సమావేశం అనంతరం సేథ్‌  ఈ విషయాన్ని ప్రకటించారు. సాధ్యమైనంత  త్వరలో భారతదేశానికి  అత్యుత‍్తమ సాంకేతిక పరిజ్ఞానాన్నిఅందించబోతున్నామన్నారు.  చైనా, ఇండియాలోలో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిన నెలరోజుల్లోనే  తమ ఉత్పత్తులను ప్రవేశపెడతామని తెలిపింది. రియల్‌మి లేటెస్ట్‌గా రియల్‌మి  ఎక్స్‌ పేరుతో ఒక  స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసందే. 8జీబీ, 48ఎంపీ కెమెరా లాంటి ఫీచర్లతో చైనాలో లాంచ్‌ చేసింది. ఈ ఏడాది అర్థభాగానికి ఈ స్మార్ట్‌ఫోన​ ఇండియన్‌ మార్కెట్లను పలకరించనుంది. ధర సుమారు.  రూ. 15400.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement