మొబైల్స్‌లోకి ఫిలిప్స్ రీఎంట్రీ | Philips S308 and W3500 Dual-SIM Android Smartphones Launched | Sakshi
Sakshi News home page

మొబైల్స్‌లోకి ఫిలిప్స్ రీఎంట్రీ

May 29 2014 1:30 AM | Updated on Sep 2 2017 7:59 AM

మొబైల్స్‌లోకి ఫిలిప్స్ రీఎంట్రీ

మొబైల్స్‌లోకి ఫిలిప్స్ రీఎంట్రీ

ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫిలిప్స్ భారత మొబైల్ ఫోన్ల విపణిలోకి తిరిగి ప్రవేశించింది. 2000 సంవత్సరం ప్రాంతంలో పలు మోడళ్లను విక్రయించిన ఈ సంస్థ, 2006 తర్వాత అర్ధంతరంగా మార్కెట్ నుంచి తప్పుకుంది.

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫిలిప్స్ భారత మొబైల్ ఫోన్ల విపణిలోకి తిరిగి ప్రవేశించింది. 2000 సంవత్సరం ప్రాంతంలో పలు మోడళ్లను విక్రయించిన ఈ సంస్థ, 2006 తర్వాత అర్ధంతరంగా మార్కెట్ నుంచి తప్పుకుంది. తిరిగి ఇప్పుడు పెద్ద లక్ష్యాన్నే విధించుకుంది. ఈ ఏడాది డిసెంబర్‌నాటికి టాప్-6 కంపెనీల్లో ఒకటిగా నిలవాలని లక్ష్యం పెట్టుకుంది. మొత్తం 15 మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 6 అంగుళాల స్క్రీన్‌గల మోడళ్లతోపాటు మధ్యస్తంగా ఉండే స్మార్ట్‌ఫోన్లను రూ.8,000-35 వేల ధరలో విడుదల చేయనుంది. ఐ928 పేరుతో రూ.35 వేల ధరలో 6 అంగుళాల ఫ్యాబ్లెట్ రానుంది. 1.7 గిగాహెట్జ్ అక్టోకోర్ ప్రాసెసర్, 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా దీని విశిష్టతలు. 4జీ మోడల్ ఈ ఏడాదే వస్తోంది. ఫిలిప్స్ బ్రాండ్ మొబైల్ ఫోన్లను చైనా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ అనుబంధ కంపెనీ అయిన సాంగ్ ఫే ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది.

 నాలుగు మోడళ్లతో..: కంపెనీ బుధవారం మూడు ఆన్‌డ్రాయిడ్, ఒక ఫీచర్ ఫోన్‌ను భారత్ లో ఆవిష్కరించింది. వీటి ధరలు రూ.1,960-20,650 మధ్య ఉంది. డబ్యూ6610 మోడల్ బ్యాటరీ సామర్థ్యం 5300 ఎంఏహెచ్. ఆన్‌డ్రాయిడ్ ఫోన్లలో ఇప్పటి వరకు అత్యంత సామర్థ్యమున్న బ్యాటరీ ఇదే. 5 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్ తదితర ఫీచర్లున్నాయి. భారత్‌లో అన్ని కంపెనీలకు ఎదగడానికి అవకాశాలున్నాయని సాంగ్ ఫే ఇండియా మేనేజర్ ఎస్.ఎస్.బస్సి  తెలి పారు. ఇక్కడి మార్కెట్‌కు అనుగుణంగా మోడళ్లను ప్రవేశపెడతామన్నారు. దేశంలో ఫిలిప్స్ ఫోన్ల పంపిణీ బాధ్యతలను రెడింగ్టన్ చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement