మొబైల్స్‌లోకి ఫిలిప్స్ రీఎంట్రీ
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫిలిప్స్ భారత మొబైల్ ఫోన్ల విపణిలోకి తిరిగి ప్రవేశించింది. 2000 సంవత్సరం ప్రాంతంలో పలు మోడళ్లను విక్రయించిన ఈ సంస్థ, 2006 తర్వాత అర్ధంతరంగా మార్కెట్ నుంచి తప్పుకుంది. తిరిగి ఇప్పుడు పెద్ద లక్ష్యాన్నే విధించుకుంది. ఈ ఏడాది డిసెంబర్‌నాటికి టాప్-6 కంపెనీల్లో ఒకటిగా నిలవాలని లక్ష్యం పెట్టుకుంది. మొత్తం 15 మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 6 అంగుళాల స్క్రీన్‌గల మోడళ్లతోపాటు మధ్యస్తంగా ఉండే స్మార్ట్ఫోన్లను రూ.8,000-35 వేల ధరలో విడుదల చేయనుంది. ఐ928 పేరుతో రూ.35 వేల ధరలో 6 అంగుళాల ఫ్యాబ్లెట్ రానుంది. 1.7 గిగాహెట్జ్ అక్టోకోర్ ప్రాసెసర్, 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా దీని విశిష్టతలు. 4జీ మోడల్ ఈ ఏడాదే వస్తోంది. ఫిలిప్స్ బ్రాండ్ మొబైల్ ఫోన్లను చైనా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ అనుబంధ కంపెనీ అయిన సాంగ్ ఫే ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది.
నాలుగు మోడళ్లతో..: కంపెనీ బుధవారం మూడు ఆన్‌డ్రాయిడ్, ఒక ఫీచర్ ఫోన్‌ను భారత్ లో ఆవిష్కరించింది. వీటి ధరలు రూ.1,960-20,650 మధ్య ఉంది. డబ్యూ6610 మోడల్ బ్యాటరీ సామర్థ్యం 5300 ఎంఏహెచ్. ఆన్‌డ్రాయిడ్ ఫోన్లలో ఇప్పటి వరకు అత్యంత సామర్థ్యమున్న బ్యాటరీ ఇదే. 5 అంగుళాల క్యూహెచ్డీ డిస్ప్లే, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్ తదితర ఫీచర్లున్నాయి. భారత్‌లో అన్ని కంపెనీలకు ఎదగడానికి అవకాశాలున్నాయని సాంగ్ ఫే ఇండియా మేనేజర్ ఎస్.ఎస్.బస్సి తెలి పారు. ఇక్కడి మార్కెట్‌కు అనుగుణంగా మోడళ్లను ప్రవేశపెడతామన్నారు. దేశంలో ఫిలిప్స్ ఫోన్ల పంపిణీ బాధ్యతలను రెడింగ్టన్ చేపట్టింది.