నగరంలో 21 లక్షల చ.అ. లావాదేవీలు  | Office space leasing deals have taken place | Sakshi
Sakshi News home page

నగరంలో 21 లక్షల చ.అ. లావాదేవీలు 

Nov 24 2018 12:39 AM | Updated on Nov 24 2018 12:39 AM

Office space leasing deals have taken place - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది మూడో త్రైమాసికం (క్యూ3)లో హైదరాబాద్‌లో 21.3 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ లావాదేవీలు జరిగాయి. క్యూ2తో పోలిస్తే ఇది రెండింతల వృద్ధి. నగరంలో సగటు లీజింగ్‌ లావాదేవీ 79 వేల చ.అ.లుగా ఉంది. కోటి చ.అ. కంటే ఎక్కువ లావాదేవీలు 70 శాతం వరకు జరిగాయి. క్యూ2లో ఇది కేవలం 30 శాతమేనని కొలియర్స్‌ ఇంటర్నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ సర్వీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వే తెలిపింది. 

క్యూ3 ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్స్‌లో 37 లక్షల చ.అ.లతో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలిచింది. 2017 క్యూ3తో పోలిస్తే ఇది 55 శాతం వృద్ధి. ఇక, ముంబైలో 19 లక్షల చ.అ., పుణెలో 18 లక్షల చ.అ, గుర్గావ్‌లో 8 లక్షల చ.అ., ఢిల్లీలో 1.4 లక్షల చ.అ. లీజింగ్‌ లావాదేవీలు జరిగాయి.  దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో 3.64 కోట్ల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్స్‌ జరిగాయి. ఏటేటా 26 శాతం వృద్ధి నమోదవుతుంది. 48 శాతం లీజింగ్స్‌ టెక్నాలజీ విభాగంలో, బ్యాంకింగ్, బీమా విభాగంలో 19 శాతం, కో–వర్కింగ్‌ స్పేస్‌ 13 శాతం లావాదేవీలున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement