
మహీంద్రా జైలో ః రూ. 7.33 లక్షలు
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ మల్టీ పర్పస్ వెహికల్ జైలో డి2 మాక్స్‌ను 9 సీట్ల ఆప్షన్‌తో హైదరాబాద్‌లో ఆవిష్కరించింది.
హైదరాబాద్: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ మల్టీ పర్పస్ వెహికల్ జైలో డి2 మాక్స్‌ను 9 సీట్ల ఆప్షన్‌తో హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. వెనకవైపు సైడ్ ఫేసింగ్ సీట్లుండే ఈ వేరియంట్ ధరను రూ.7.33 లక్షలుగా(ఎక్స్ షోరూమ్, హైదరాబాద్) నిర్ణయించామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్వహణ వ్యయాలు తక్కువని, ఎక్కువ స్థలం ఉంటుందని, అత్యుత్తమ మైలేజీ(లీటర్‌కు 14.95 కిమీ)ని ఇస్తుందని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్(ఆటోమోటివ్ డివిజన్) వివేక్ నాయర్ పేర్కొన్నారు.