లాలిపాప్... యాప్ ఆవిష్కరణ | Lollipop App invention | Sakshi
Sakshi News home page

లాలిపాప్... యాప్ ఆవిష్కరణ

Apr 3 2016 1:23 AM | Updated on Sep 3 2017 9:05 PM

లాలిపాప్... యాప్ ఆవిష్కరణ

లాలిపాప్... యాప్ ఆవిష్కరణ

పెద్దలు చెప్పే కథలు వింటూ నిద్రలోకి జారుకోవాల్సిన చిన్నారులు... టీవీ కార్టూన్ల మాయాజాలంలో చిక్కుకుంటున్నారనేది ఇప్పటి తల్లిదండ్రుల ఆవేదన.

సాక్షి, హైదరాబాద్: పెద్దలు చెప్పే కథలు వింటూ నిద్రలోకి జారుకోవాల్సిన చిన్నారులు... టీవీ కార్టూన్ల  మాయాజాలంలో చిక్కుకుంటున్నారనేది ఇప్పటి తల్లిదండ్రుల ఆవేదన. అందుకే నేటి టెక్నాలజీకి తగ్గట్టుగా 5-12 ఏళ్ల లోపు పిల్లలకు అర్థమయ్యేలా, పిల్లలో ఊహాశక్తిని పెంచేలా... కేవలం వాయిస్ మాత్రమే ఉండే ఓ యాప్ రూపొందింది.

‘లాలీపాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ డెరైక్టర్ రామలక్ష్మి ఏమిరెడ్డి సూచనల మేరకు  ప్రముఖ నటుడు, దర్శక-రచయిత రావికొండలరావు ఆధ్వర్యంలో రూపొందిన దీని పేరు ‘లాలిపాప్ స్టోరీస్’. దీన్ని శనివారం హైదరాబాద్‌లో ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. ‘నీతి కథలను చెప్పేలా లాలీపాప్ ఈ యాప్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంద’న్నారు. ముఖ్యఅతిథుల్లో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ- మన సంప్రదాయాలను మర్చిపోకూడదన్నారు. సంస్థ డెరైక్టర్లలో ఒకరైన రాజేంద్రప్రసాద్, రావికొండలరావు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement