ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త

Good news for all SBI ATM card holders - Sakshi

ఎస్‌బీఐ ఏటీఎం ఉపసంహరణలపై సర్వీస్ ఛార్జీలు రద్దు

సాక్షి, ముంబై: అతిపెద్ద దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన కస్టమర్లకు  శుభవార్త చెప్పింది.  ఏటీఎం కార్డు లావాదేవీలపై సర్వీసు ఛార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.  కరోనా వైరస్  విస్తరణ, లాక్‌డౌన్,  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. తాజా నిర్ణయం ప్రకారం ఎన్నిసార్లైనా డబ్బులను ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఖాతాదారులకు లభించింది.  వీటికి అదనంగా ఎలాంటి సర్వీస్ ఛార్జీలను వసూలు చేయబోమని  బ్యాంకు  తెలిపింది. అంతేకాదు  ఎస్ బీఐ ఏటీఎంలు మాత్రమే కాకుండా  ఏ ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు  డ్రా చేసినా ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటించింది. ఈ వెసులుబాటు ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు ఉంటుందని ట్విటర్ వేదికగా  ఎస్‌బీఐ ప్రకటించింది. (యాపిల్ ఐఫోన్ ఎస్ఈ వచ్చేసింది..)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top