ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 19 శాతం వృద్ధి | Direct tax collection up 19% in Apr-July at Rs 1.90 lakh crore | Sakshi
Sakshi News home page

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 19 శాతం వృద్ధి

Aug 10 2017 1:14 AM | Updated on Sep 17 2017 5:21 PM

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 19 శాతం వృద్ధి

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 19 శాతం వృద్ధి

ప్రత్యక్ష పన్ను వసూళ్లు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌– జూలై మధ్య 19 శాతం పెరిగాయి.

ఏప్రిల్‌–జూలై మధ్య రూ.1.90 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌– జూలై మధ్య 19 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది రూ.1.90 లక్షల కోట్లు. 2017–18 మధ్య కాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.80 లక్షల కోట్లుగా ఉండాలని బడ్జెట్‌లో లకిష్యంచారు. తాజా వసూళ్ల మొత్తం ఇందులో 19.5 శాతంగా ఉంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ ట్యాక్స్‌లతో కూడిన ప్రత్యక్ష పన్ను వసూళ్ల వృద్ధి క్రమంగా వృద్ధి చెందుతున్నట్లుఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. కాగా రిఫండ్స్‌ విలువ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలంలో రూ.61,920 కోట్లని ఈ ప్రకటనలో వివరించింది.   
 

Advertisement

పోల్

Advertisement