డేటావిండ్ నుంచి చౌక ఇంటర్నెట్ సర్వీసుల మొబైల్ | Datawind to unveil mobile phones with free basic Internet | Sakshi
Sakshi News home page

డేటావిండ్ నుంచి చౌక ఇంటర్నెట్ సర్వీసుల మొబైల్

Jan 27 2015 10:31 AM | Updated on Sep 2 2017 8:18 PM

డేటావిండ్ నుంచి చౌక ఇంటర్నెట్ సర్వీసుల మొబైల్

డేటావిండ్ నుంచి చౌక ఇంటర్నెట్ సర్వీసుల మొబైల్

ఇంటర్నెట్ సర్వీసులు ఉచితంగా అందించే బేసిక్ ఇంటర్నెట్ మొబైల్ ఫోన్‌లను డేటావిండ్ సంస్థ అందుబాటులోకి తేనున్నది.

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సర్వీసులు ఉచితంగా అందించే బేసిక్ ఇం టర్నెట్ మొబైల్ ఫోన్‌లను డేటావిం డ్ సంస్థ అందుబాటులోకి తేనున్నది.  ఈ ఇంటర్నెట్ ఫోన్ ధర రూ.3,000 రేంజ్‌లో ఉంటుందని  డేటావిండ్ వ్యవస్థాపకుడు, సీఈఓ సునీత్ సింగ్ తులి చెప్పారు. ఈ మొబైల్ ఫోన్‌ల విక్రయాల కోసం ప్రస్తుతం ప్రముఖ ప్రైవేట్ రంగ టెలికం కంపెనీతో తుది దశ సంప్రదింపులు జరుపుతున్నామని, వచ్చేనెలలో ఒప్పందం కుదరవచ్చని వివరించారు.

ఇటీవలనే 3 కోట్ల కెనడా డాలర్ల(రూ. 150 కోట్లు)ను పబ్లిక్ ఆఫర్ ద్వారా సమీకరించామని, ఈ నిధులను ఈ ఇంట ర్నెట్ ఫోన్ కోసం వివనియోగిస్తామని పేర్కొన్నారు. రూ.4,000లోపు ధర ఉన్న ఫోన్లను 76 శాతం కొనుగోలు చేస్తున్నారని, రూ.2,000 ధర ఉన్న ఫోన్లను 60 శాతం మంది కొనుగోలు చేస్తున్నారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement