వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా ఆ పార్టీ నేతలు స్థానిక కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఆమరణ దీక్షను ఆదివారం ఉదయం పోలీసులు భగ్నం చేశారు.
కడప అర్బన్, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా ఆ పార్టీ నేతలు స్థానిక కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఆమరణ దీక్షను ఆదివారం ఉదయం పోలీసులు భగ్నం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి టికె అఫ్జల్‌ఖాన్, నేతలు భూపేష్‌రెడ్డి, పివి నరసింహారెడ్డి, రామలింగేశ్వరరెడ్డిలను పోలీసులు బలవంతంగా రిమ్స్‌కు తరలించి వైద్యపరీక్షలు చేయించారు.
వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సూచన మేరకు వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో రిమ్స్‌లో దీక్షలను విరమింపజేశారు. ఎనిమిది రోజులుగా వీరు దీక్ష చేపట్టారని, తొమ్మిదవరోజుకు చేరుకునేసరికి ఆరోగ్యం క్షీణించినందున పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారని సురేష్‌బాబు అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, అంజద్‌బాషా, నిత్యానందరెడ్డి, బాబు పాల్గొన్నారు.