అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు డి.ఏ.సోమయాజులును పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు.
సాక్షి, హైదరాబాద్ : అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు డి.ఏ.సోమయాజులును పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఉదయం 11.30 గంటలకు జగన్ సోమయాజులు నివాసానికి వెళ్లారు.
గంట సేపు ఆయనతో గడిపి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సోమయాజులు బాగా కోలుకున్నారు.