నెటిజన్లకు వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు | Ys Jagan Mohan Reddy thanked Netizens for their support to Ysrcp | Sakshi
Sakshi News home page

నెటిజన్లకు వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు

Jun 6 2019 10:37 AM | Updated on Jun 6 2019 2:33 PM

Ys Jagan Mohan Reddy thanked Netizens for their support to Ysrcp - Sakshi

మీ సహకారాన్ని ఎప్పుడూ ఇలానే కొనసాగిస్తారని ఆశిస్తున్నా..

సాక్షి, అమరావతి : సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం కృషి చేసిన నెటిజన్లకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపారు. 'నేను రాష్ట్ర బాధ్యతలను స్వీకరించటానికి సహకరించిన సోషల్‌ మీడియా యోధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం మీరు ఎంతలా కష్టపడ్డారో నాకు తెలుసు. ఎల్లో మీడియా తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. మీ సహకారాన్ని ఎప్పుడూ ఇలానే కొనసాగిస్తారని ఆశిస్తున్నా' అని ట్విటర్‌లో పేర్కొన్నారు. మరోవైపు వైఎస్‌ జగన్‌ ట్విటర్‌ ఫాలోవర్ల సంఖ్య 1మిలియన్‌ దాటింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement