అధ్వాన్నం! | wrost to school food | Sakshi
Sakshi News home page

అధ్వాన్నం!

Feb 4 2016 12:42 AM | Updated on Sep 3 2017 4:53 PM

అధ్వాన్నం!

అధ్వాన్నం!

మండలంలోని పాలవలస జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందంటూ ఆ పాఠశాల విద్యార్థులు నాలుగు రోజులుగా ఆరోపిస్తుండగా, వారి తల్లిదండ్రులు బుధవారం పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు.

 బూర్జ: మండలంలోని పాలవలస జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందంటూ ఆ పాఠశాల విద్యార్థులు నాలుగు రోజులుగా ఆరోపిస్తుండగా, వారి తల్లిదండ్రులు బుధవారం పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. అస్సలు భోజనం బాగోవడంలేదని, కనీసం పశువులు, కుక్కలు కూడా తినలేని విధంగా వంట చేస్తున్నారని,  అన్నం జావలా వండుతున్నారని ధ్వజమెత్తారు.
 మంగళవారం పెట్టిన గుడ్లు పూర్తిగా కుళ్లిపోయాయని, ఈ కారణం వల్లే లక్కుపురం గ్రామానికి చెందిన విద్యార్థులు వాంతులతో అస్వస్థతకు గురయ్యారనిఆవేదన వ్యక్తం చేశారు.పాఠశాల విడిచిపెట్టిన వెంటనే భోజనం పెట్టాల్సినప్పటికీ రోజూ సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు భోజనం దీంతో పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని వారు వాపోయారు. భోజనం ఇలానే ఉంటే పిల్లలను బడికి పంపించబోమని కరాఖండీగా చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఈఓ ఐ.వెంకటరావు పాఠ శాల వద్దకు

హెచ్‌ఎం మాలతిని, వంట ఏజెన్సీని మందలించారు. సక్రమంగా వంట చేయని వంట ఏజెన్సీలను నిర్దాక్షిణ్యంగా తొలగించాలని ఆయన హెచ్‌ఎంను ఆదేశించారు. ఇకపై సమస్య రాకుండా చూస్తామని, సకాలంలో పౌష్టికాహారం అందిస్తామని డిప్యూటీ డీఈఓ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. అనంతరం దగ్గరుండి వంట చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ జల్లు అప్పలస్వామి నాయుడు, గ్రామపెద్దల జల్లు పోలినాయుడు, సత్యం, ఎంఆర్‌పీ జి.శ్రీరామ్ ఉపాధ్యాయులు ఉన్నారు
 

Advertisement

పోల్

Advertisement